Ratan Tata Life journey.
- Get link
- X
- Other Apps
టాటా ఈ పేరు తెలియని భారతీయుడు ఉండడు.. ఉప్పు నుండి హుక్కు వరకు టీ నుండి ట్రాక్స్ వరకు ఇలా ప్రతి దానిలో టాటా పేరు వినబడుతుంది. ఆరు లక్షల కోట్ల రూపాయల విలువ తో సుమారుగా ఏడు లక్షల మంది ఉద్యోగులతో మన దేశంలోనే అతిపెద్ద వ్యాపార సామ్రాజ్యంగా టాటా కంపెనీ మొదటి స్థానంలో నిలిచింది ఇంత పెద్ద కంపెనీ నీ ముందుండి నడిపిస్తున్న వ్యక్తి రతన్ టాటా దేశంలోనే అతి పెద్ద కంపెనీలు అయినటువంటి రిలయన్స్ ఆదిత్య బిర్లా ధీరుబాయ్ అంబానీ గ్రూప్ ఈ మూడు కలిపిన కూడా వీటన్నిటి కన్నా టాటా గ్రూప్స్ ఏ పెద్దది కానీ ఇంత పెద్ద కంపెనీ అయినా సరే ఏనాడు అత్యంత ధనవంతుల జాబితాలో టాటా గ్రూప్ ఎందుకు లేరో తెలుసుకుందాం అలాగే సుమారు 150 ఏళ్ల చరిత్ర ఉన్న టాటా గ్రూప్ గురించి దాన్ని నిర్మించిన రతన్ టాటా గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
టాటా కంపెనీ మొదట ఒక కాటన్ మిల్లు గా తయారయింది జంషెడ్జీ టాటా అనే ఆయన దీనిని స్థాపించారు అలా 1868లో మొదలైన ఈ కంపెనీ తరతరాలుగా చేతులు మారుతూ వచ్చింది అసలు మన దేశంలో మొట్టమొదటి సారిగా ఎయిర్ లైన్స్ కంపెనీ నీ స్థాపించింది టాటా లే ఇప్పుడు ఎయిర్ ఇండియా గా చెప్పుకుంటున్న ఎయిర్ లైన్స్ సంస్థ టాటా ఎయిర్లైన్స్ గా ఉండేది కానీ రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ప్రభుత్వం చేతిలోకి వెళ్ళిపోయింది ఇదొక్కటే కాదు ఆసియాలో నే మొట్టమొదటీ స్టీల్ కంపెనీ అలాగే మన దేశంలోని మొట్టమొదటి హోటల్ అయినటువంటి తాజ్ హోటల్ ని స్థాపించింది టాటా నే.
ఇలా మన దేశానికి టాటా లు ఎన్నో కొత్త కొత్త వ్యాపారాలను పరిచయం చేశారు వీరందరిలో మనం ముఖ్యంగా చెప్పుకోవాల్సింది రతన్ టాటా గురించి రతన్ టాటా డిసెంబర్ 28 1937 సంవత్సరం దేశంలోనే ఒక ధనిక కుటుంబంలో జన్మించారు ఈయనకి పదేళ్ళ వయసున్నప్పుడు ఈయన తల్లిదండ్రులు ఇద్దరూ విడిపోవడంతో వాళ్ళ నానమ్మ తో పెరిగాడు తర్వాత అమెరికాలోని అర్బన్ యూనివర్సిటీ లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడు వెంటనే ఐబీఎం కంపెనీ లో ఉద్యోగం వచ్చింది కానీ జె.ఆర్.డి.టాటా రతన్ టాటా ని ఇండియాకి వచ్చి టాటా స్టీల్ లో చేరమని సలహా ఇవ్వడంతో ఇండియాకి వచ్చి జంషెడ్పూర్ లోనీ స్టీల్ ప్లాంట్ లో అప్రెంటిస్ గా తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాడు కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత 1991లో జె.ఆర్.డి.టాటా రతన్ టాటా ని టాటా గ్రూప్స్ చైర్మన్ గా నియమించారు అప్పట్లో చాలామంది బోర్డ్ ఆఫ్ మెంబర్స్ఈ నిర్ణయాన్ని తప్పుపట్టారు ఎటువంటి అనుభవం లేని రతన్ టాటా చేతిలో కొన్ని కోట్ల రూపాయల వ్యాపారాన్ని చేతిలో పెట్టడాన్ని వ్యతిరేకించారు కానీ వాళ్ళ అందరి అభిప్రాయాలు తప్పని నిరూపించాడు ratan tata ఈయన హయాంలో టాటా గ్రూప్స్ పరుగులు తీసింది పదివేల కోట్లు గా ఉండాల్సిన వ్యాపారాన్ని ఆరు లక్షల కోట్లకు చేర్చాడు రతన్ టాటా ఇంత పెద్ద కంపెనీని నడుపుతున్నప్పటికి కూడా రతన్ టాటా భారతదేశంలో గాని ప్రపంచ ధనవంతుల జాబితాలో గానీ ఏనాడు కనిపించలేదు ఎందుకంటే టాటా కంపెనీస్ కి వచ్చే లాభాలలో 66% టాటా ట్రస్ట్ ద్వారా నిర్వహిస్తున్న సేవా సంస్థలకు వెళ్లిపోతుంది అందువల్ల టాటా గ్రూప్స్ విలువ ఆరు లక్షల కోట్ల రూపాయలకు ఎక్కువే అయినప్పటికీ రతన్ టాటా ఆస్తి విలువ ఐదు వేల మూడు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఒకవేళ ఈ ఆస్తి అంతా సేవా సంస్థలకు కాకుండా రతన్ టాటా కి చెందినట్లు అయితే ప్రపంచ కుబేరులు ముగ్గురిలో ఒకరిగా ఉండేవారు.
రతన్ టాటా తన ప్రయాణంలో ఎన్నో అవమానాలు అవరోహలను ఎదుర్కొన్నారు దానికి ఒక ఉదాహరణ మనం తెలుసుకుందాం 1998లో రతన్ టాటా టాటా ఇండికా కార్లను ను ప్రవేశపెట్టారు
అ కార్లు మొదటి సంవత్సరంలోనే ఫెయిల్ అయ్యాయి దీంతో అందరూ టాటా ఇండికా ను ఆమేయ్యేయలని సలహా ఇచ్చారు దానికి రతన్ టాటా కూడా ఒప్పుకొని టాటా ఇండికా ను ఆమేయ్యేయలని అమెరికాలోని ఫోర్డ్ కంపెనీ కి తన టీం తో వెళతాడు ఆ మీటింగ్ లో ఫోర్డ్ కంపెనీ చైర్మన్ మీకు కార్లను ఏల తయారు చేయలో తెలినప్పుడు కార్ల బిసినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు అని టాటా మరియు ఆయన టీం ను అవమాన పరిచాడు దాంతో రతన్ టాటా ఆ డీల్ ను మాట్లాడకుండా నే ముంబై కి తిరిగిగి ఒచేస్తాడు కొన్ని సంవత్సరాల తరువాత టాటా ఇండిక నష్టాలనుండి లాభాల బాట పట్టింది అయితే ఆదే సమయంలో ఫోర్డ్ కంపెనీ కి చెందిన luxury కార్లు జాగ్వర్, లాంద్రోవేర్ కంపెనీలు భారీగా నష్టాల్లోకి వెళ్ళిపోయాయి అయితే ఆ సమయంలో రతన్ టాటా ఫోర్డ్ కంపెనీ కి ఆ రెండు కార్లను కొంట్టనని ఆఫర్ చేసాడు ఈసారి ఫోర్డ్ కంపెనీకి చెందిన అమెరికన్ టీం ముంబైకి చేరుకుని టాటాను కాలుసుకుంది అలా నష్టాల్లో ఉన్న ల్యాండ్ రోవర్ జాగ్వార్ కార్లను 9300 కోట్లకు కొనుగోలు చేసి లాభాల బాట పట్టించాడు ఈ విధంగా తనను ఎవరైతే చిన్నచూపు చూసి అవమానపరిచారో వారినే తన వద్దకు వచ్చేలా చేసుకున్నాడు రతన్ టాటా.
ఈదొక్కటే కాదు యూరప్ కి చెందిన కోరస్ అనే స్టిల్ కంపెనీని కొనుగోలు చేశాడు అలానే ఇంగ్లాండ్ కు చెందిన టెట్లి టీ ని టాటా టీ లో కలపడంతో ప్రపంచంలోనే అతిపెద్ద టీ కంపెనీ గా టాటా టి ఎదిగింది ఒకప్పుడు ఏ బ్రిటిష్ వారైతే మన భారతీయులను పరిపాలించారో ఇప్పుడు అదే బ్రిటిష్ వాళ్లకు తన కింద ఉద్యోగాలను ఇచ్చే స్థాయికి ఎదిగారు ఇవే కాదు ఇతర దేశాలకు చెందిన 22 కు పైగా అంతర్జాతీయ కంపెనీలను టాటా లో కలుపుకుని టాటా ను ఒక ఇంటర్నేషనల్ బ్రాండ్ గా మార్చాడు ratan tata.
టాటా లు ఎప్పుడు ఇండియా ను ఒక ఎకనామిక్ సూపర్ పవర్ అవ్వాలని అనుకోలేదు భారతదేశం ఎప్పుడు ఒక ఆనందకరమైన దేశంగా ఎదగాలని కోరుకున్నారు అందుకే వారు ఎప్పుడు పేద మధ్యతరగతి వారి గురించే కృషి చేశారు అందుకు ఉదాహరణ టాటా నానో.
ఒకరోజు టాటా కార్లో ప్రయాణిస్తుండగా స్కూటర్ మీద భార్య భర్త ఇద్దరు పిల్లలు కలిసి వర్షంలో ఇబ్బంది పడుతూ వెళ్ళటం చూసిన ratan tata పేద మధ్యతరగతి కుటుంబాల కల నెరవేరాలని తక్కువ ధరలో లక్ష రూపాయలకే కార్లను తయారు చేయాలనుకున్నాడు అయితే ఎంతోమంది ఇది విని హేళన చేశారు కొంతమంది లక్ష రూపాయలకే కారును ఎలా తయారు చేస్తావని భయపెట్టారు మరికొంతమంది నవ్వుకున్నారు రతన్ టాటా మాత్రం వెనక్కి తగ్గలేదు ఇంజనీర్లను పిలిచారు వారు లక్ష రూపాయల్లో కారును తయారు చేయడం కుదరదని చెప్పారు అయినా రతన్ టాటా వినలేదు ధైర్యంగా ముందడుగు వేశారు చివరగా ప్రపంచంలోనే అత్యంత చౌకైన కారు విడుదలైంది ఇది విని ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది అయితే కొన్ని కారణాల వల్ల నానో కార్ విఫలమైంది నానో కార్ తయారు చేయడం వల్ల కొన్ని వేల కోట్ల నష్టం వస్తున్నప్పటికీ ఆయన మాత్రం కార్లను తయారు చేయడం ఆపలేదు ఎందుకంటే అది ఆయన కళల కారు, కారులో తిరగాలి అనుకునే ప్రతి పేదవాడి కలను నిజం చేయడమే ఆయన కల ratan tata వ్యాపారవేత్తగా తన సుదీర్ఘమైన కాలంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాడు
నానో కార్ల కోసం పశ్చిమబెంగాల్లో ప్లాంట్ నిర్మాణం మొత్తం అయిపోయిన తర్వాత అక్కడి ప్రజలు వ్యతిరేకించడంతో మొత్తం ప్లాంట్ అంతటిని పశ్చిమ బెంగాల్ నుండి గుజరాత్ కి తరలించడానికి ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఇవే కాదు 2008లో టాటా గ్రూప్ కు చెందిన తాజ్ హోటల్ పైన ఉగ్రవాదులు దాడి జరపడం ఇలా ఎన్నో కష్టాలను ధైర్యంగా తట్టుకున్నారు.
80 ఏళ్ల పైబడిన రతన్ టాటా లో చురుకుదనం ఏమాత్రం తగ్గలేదు ఇప్పటికీ కూడా గంటకి 200 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించే ఫాల్కన్ విమానలను హెలికాప్టర్లు సూపర్ ఫాస్ట్ కార్లను నడపడం ఈయన హాబీ. రతన్ టాటాకు యువత మీద వారి శక్తి మీద మంచి నమ్మకం ఉంది అందుకే ఆయన snapdeal, ఓలా, xioami ఇలా 39 కి పైగా స్టార్టప్స్ లో పెట్టుబడులు పెట్టి యువతను ప్రోత్సహిస్తున్నారు.
సాధారణంగా వ్యాపారం అంటే విస్తరణ లాభాలు వారసత్వం ఇలా ఉంటుంది కానీ టాటా మాత్రం అలా కాదు టాటా గ్రూప్ ఎప్పుడు కూడా తన కుటుంబం కోసం లేక వ్యక్తిగత ఆస్తులు కూడా పెట్టడం కోసమో వ్యాపారం చేయలేదు కంపెనీలకు వచ్చే 66 శాతం లాభాలను సమాజ సేవకు ఖర్చుచేసే ఏకైక కంపెనీ ప్రపంచంలోనే టాటా గ్రూప్స్ ఒక్కటే, టాటా లు సంపాదించిన దాంట్లో చాలా వరకు సమాజానికి వెచ్చిస్తున్నారు అందుకే భారతీయుల్లో టాటా అంటే ఒక నమ్మకమైన బ్రాండ్ గా స్థిరపడిపోయింది నిజాయితీ విలువలు టాటా గ్రూప్ డిఎన్ఏ లోనే ఉన్నాయి తాజ్ హోటల్ పైన దాడి జరిగినప్పుడు అక్కడి ఉద్యోగులు చూపిన తెగువే దానికి నిదర్శనం ఆంత భయంకరమైన పరిస్థితుల్లో కూడా ఏ ఉద్యోగి కూడా తమ ప్రాణాలు లెక్క చేయకుండా తమ హోటల్లోని 15 వందల మంది అతిథులను కాపాడారు ఆ ప్రయత్నంలో భాగంగా హోటల్ ఉద్యోగులు ప్రాణాలు సైతం కోల్పోయారు ఆ ఒక్క సంఘటన తో టాటా గ్రూప్స్ విలువలకు ఎంత ప్రాధాన్యం ఇస్తుందో ప్రపంచానికి అర్థమైంది అలాగే టాటా ట్రస్ట్ దేశంలోని మారుమూల పేద ప్రజలకు విద్య ఉద్యోగం ఆరోగ్యం అందించే దిశగా కృషి చేస్తుంది ఇప్పటికే మన దేశం తో పాటు విదేశాల్లో చదువుతున్న ఎన్నో వేలమంది భారతీయ విద్యార్థులకు టాటా ట్రస్ట్ ద్వారా స్కాలర్షిప్స్ అందుతున్నాయి ఇంతేకాదు అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీ కి 300 కోట్లకు పైగా విరాళం ఇచ్చారు రతన్ టాటా అందుకుగాను హార్వర్డ్ యూనివర్సిటీ తన క్యాంపస్లోని భవనానికి టాటా హాల్ అని పేరు పెట్టింది.
ఇంతవరకు ఎందుకు దీపావళి కానుకగా క్యాన్సర్ పేషంట్ల కోసం వెయ్యి కోట్లను దానం చేశారు రతన్, కరోనాతో యావత్ ప్రపంచం ఆంత తలకిందులైంది ఆ సమయంలో 1500 కోట్ల రూపాయలను విరాళంగా ఇచ్చారు రతన్ టాటా. టాటా ఈయన చేసిన ఎన్నో సేవలకు గుర్తింపుగా భారత ప్రభుత్వం పద్మభూషణ్ పద్మ విభూషణ్ అవార్డులతో సత్కరించింది.
ప్రపంచంలోని పలు విశ్వవిద్యాలయాలు ఆయనను డాక్టరేట్ తో గౌరవించాయి యావత్ పారిశ్రామిక ప్రపంచానికి ఆదర్శప్రాయుడైన ratan tata మన దేశానికి చెందిన వారు కావడం గర్వించదగ్గ విషయం. ఒకప్పుడు వ్యాపారం చేయడానికి పనికిరాడు అన్నారు ఇప్పుడు 10 వేల కోట్లు విలువైన సంస్థని ఆరు లక్షల కోట్ల విలువైన సామ్రాజ్యంగా మార్చారు.
రతన్ టాటా టాటా అడుగుపెట్టని వ్యాపారం అంటూ లేదు దాదాపు 96 కి పైగా వ్యాపారాలను నడుపుతోంది ఈ సంస్థ ఇంత పెద్ద పారిశ్రామికవేత్త అయినప్పటికీ ఆయన లైఫ్ స్టైల్ మాత్రం చాలా సింపుల్ గా ఉంటుంది అందరిలా తన వ్యాపారాలు లాభాలు ఒకటే ముఖ్యమని అనుకుని ఉంటే ప్రపంచ కుబేరుల్లో మూడు స్థానాల్లో ఏదో ఒక స్థానం సంపాదించేవాడు రతన్ టాటా కానీ తను వాటి గురించి ఎప్పుడూ ఆలోచించలేదు సంపాదించిన దాంట్లో పది రూపాయలు దానం చేయడానికి పది సార్లు ఆలోచించే ఈ సమాజంలో ఏకంగా కోట్లతో సొంతంగా ట్రస్ట్ ని ఏర్పాటు చేసి ఎంతోమందికి ఎన్నో రకాలుగా సహాయం చేస్తున్న రతన్ టాటా కి హ్యాట్సాఫ్..
- Get link
- X
- Other Apps








Comments
Post a Comment